Share News

చెరువులకు నీరందించిన ఘనత టీడీపీదే

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:22 AM

హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

చెరువులకు నీరందించిన ఘనత టీడీపీదే
హుసేనాపురం చెరువు దగ్గర పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

ప్యాపిలి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని హుసేనాపురం, చంద్రపల్లి చెరువలకు నీరు చేరడంతో ఆయన చెరువుల దగ్గర గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ చెరువుల నీరు చేరడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. సాగునీటితోపాటు తాగు నీటి కష్టాలు కూడ తీరుతాయన్నారు. రైతులు మంచి పంటలు పండించి ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. చెరువులకు నీరు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. రైతులు పథకానికి సంబంధించిన పైపులైన్లను దుండ గులు ధ్వంసం చేయకుండా తరచూ పరిశీలించాలన్నారు. చెరు వులకు నీరందించడంతో చంద్రపల్లి, హుసేనాపురం రైతులు ఎమ్మెల్యే కోట్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వై లక్ష్మీనారా యణయాదవ్‌, ఎస్‌ఐ నాగార్జున, ఆదినారాయణ, తిమ్మారెడ్డి, దామోదర్‌, జనార్దన, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:22 AM