Share News

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బీవీ

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:34 AM

ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం: ఎమ్మెల్యే బీవీ
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలు కాపాడడానికి రూ.40 వేలు విలువ చేసే ఆరు ఇంజెక్షన్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైనన్నీ అందుబాటులో ఉంచుతామన్నారు. గతనెలలో ఒక్కటే దాదాపు రెండువేల మందికి వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. పాత భవనంలో మరమ్మతులు చేపట్టి వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ సుధ, డాక్టర్‌ ఆదినాగేశ్‌, హెచ్‌డీసీ సభ్యులు రామకృష్ణ నాయుడు, సురేష్‌ చౌదరి, అంబేడ్కర్‌, నాయకులు కమ్మ మహేంద్ర బాబు, మాచాని మహేశ్‌, నరసింహులు, కటారి రాజేంద్ర, మిన్నప్ప, నరసన్న గౌడ్‌, బీజేపీ నరసింహులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వివిద పార్టీలకు చెందిన పలువురు నాయకులు బుధవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే స్వగృహం దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిని లారీ ఓనర్స్‌ అసోషియేషన్‌కు చెందిన యూసుఫ్‌, 27వ వార్డుకు చెందిన బాబు, పెద్దమరివీడుకు చెందిన దస్తగిరి, 8వ వార్డుకు చెందిన రవితేజలతో పాటు వారి అనుచరులు టీడీపీలో చేరారు.

శివన్ననగర్‌లో పర్యటన: పట్టణంలోని శివన్ననగర్‌, టిడ్కో గృహాల సముదాయంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పర్యటించారు. స్థానిక శివన్న నగర్‌లో చేనేతల ఇళ్లలో ఉన్న మగ్గాల గుంతల్లోకి చేరిన వర్షం నీటిని చూశారు. అలాగే లబ్ధిదారులకు పింఛన్‌ అందజేశారు. అలాగే టిడ్కో గృహాల సముదాయంలో రూ. 1కోటితో ఏర్పాటు చేయనున్న చేనేతశాలకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం 5వ వార్డులో ఎమ్మెల్యే బీవీ, బీజేపీ నాయకుడు నరసింహులతో పాటు వార్డుప్రజలతో కలిసి సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాచాని మహేశ్‌, మాజీ కౌన్సిలర్‌ రంగస్వామి గౌడ్‌, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2025 | 12:34 AM