Share News

Massive Robbery: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీలో భారీ దోపిడీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:11 PM

కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన అబ్దుల్లా పూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ దోపిడి జరిగింది. కాలేజీలోని లాకర్స్ బ్రేక్ చేసి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు.

Massive Robbery: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీలో భారీ దోపిడీ
Massive Robbery

హైదరాబాద్, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Congress Party MLA Kasireddy Narayana Reddy)కి చెందిన అబ్దుల్లా పూర్ మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల (Brilliant Engineering College)లో భారీ దోపిడీ జరిగింది. కాలేజీలోని లాకర్స్ బ్రేక్ చేసి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. మూడు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఓకే చోట జమ చేశారు నిర్వాహకులు. సేఫ్ లాకర్స్‌ని సైతం బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్లారు దుండగులు. ఈ విషయంపై వెంటనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు అబ్దుల్లా పూర్ మెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ క్రమంలో బ్రిలియంట్ కాలేజీకి వచ్చి విచారణ జరుపుతున్నారు పోలీసులు. దొంగ ఒక్కరే లాకర్‌లోని డబ్బులు దోచుకుని పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 200 సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్‌ని సైతం ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులకు క్లూస్ చిక్కకుండా దొంగలు జాగ్రత్తలు పాటించినట్లు సమాచారం. దుండగుల కోసం కాలేజీ దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దొంగల కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. అనుమానిత వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 01:25 PM