Share News

MLA: కాంగ్రెస్‌ బాకీలపై నిలదీయాలి..

ABN , Publish Date - Oct 07 , 2025 | 09:38 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్‌ను విడుదల చేశారు.

MLA: కాంగ్రెస్‌ బాకీలపై నిలదీయాలి..

- ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు(Kukatpally MLA Krishna Rao) అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్‌ను విడుదల చేశారు.


city6.2.jpgఅనంతరం ఆయన మాట్లాడుతూ, అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలకు లక్షలాది రూపాయలు బాకీ పడ్డారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


అభివృద్ధే ధ్యేయం

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

బాలానగర్‌: ఫిరోజ్‌గూడ అభివృద్ధియే ధ్యేయంగా పని చేస్తున్నానని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్‌ డివిజన్‌ ఫిరోజ్‌గూడ ఆంజనేయ స్వామి ఆలయ ముఖద్వారాన్ని కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు.

city6.3.jpg


ఫిరోజ్‌గూడ వాసుల ఆకాంక్షను నెరవేర్చేందుకు రూ.25లక్షల సొంత నిధులను ఖర్చు చేసి ఆలయ ముఖద్వారాన్ని నిర్మించినట్టు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి లక్ష్మారెడ్డి, సతీష్ గౌడ్‌, ఖాజా, సుధాకర్‌రెడ్డి, కవిత, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగులు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆల్మట్టి ఎత్తు తగ్గింపుపై హామీతో రావాలి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ రాజకీయం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 09:38 AM