Home » MLA
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.
విస్తృతస్థాయి సమవేశానికి పూర్తి సమాచారంతో కాకుండా నిర్లక్ష్యంగా వస్తే చర్యలు తప్పవని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి పరిధిలోని సొసైటీల సీఈఓలు, బ్యాంకుల అధికారులు, ఉద్యోగులపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.
స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.రాజ్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆయనపై చేయి చేసుకున్నారు.
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్‌తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్‌కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
దొర్నిపాడు గ్రామానికి చెందిన బాసిరెడ్డి వీరారెడ్డ్డి, అతడి అల్లుళ్లు రాజారెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలు హెల్త్ అండ్‌వెల్త్ ఫైనాన్సియల్ కంపెనీలో ప్రజలు డబ్బులు కట్టి మోస పోయిన బాధితులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.