Share News

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

ABN , Publish Date - Jan 15 , 2026 | 11:25 AM

జగన్‌ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

MLA Kalava Srinivasulu: బద్దలైన జగన్‌ రాజకీయ కుట్ర..

- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం(అనంతపురం): చంద్రబాబు విషయంలో జగన్‌రెడ్డి చేసిన రాజకీయకుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు(MLA Kalava Srinivasulu) బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.


ఐదు దశాబ్దాల నిష్కలంక ప్రజానాయకుడికి అవినీతి మరకలు అంటించాలనుకోవడం అవివేకమన్నారు. అవినీతి మడుగులో నిండా మునిగిన జగన్‌రెడ్డి ఆ బురదను చంద్రబాబుకు అంటించాలనుకున్నాడని విమర్శించారు. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసును బాబు మెడకు చుట్టాలనుకోవడం అత్యంత దారుణమన్నారు.


pandu2.jpg

అక్రమ కేసులో 53 రోజుల పాటు జైలులో గడిపిన చంద్రబాబులో ఇసుమంత భయం కనిపించలేదన్నారు. అదే 2024 సాధారణ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి పెట్టిందన్నారు. పైశాచిక ఆనందం పొందిన జగన్‌రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. సమకాలీన రాజకీయాల్లో నిజాయతీకి నిలువెత్తు సంతకం చంద్రబాబు అని కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 15 , 2026 | 11:29 AM