గ్రామీణ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:14 AM
గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
డోన టౌన, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. మంగళవారం సాయం త్రం మండలంలోని వెంకటాపురం, గుమ్మకొండ గ్రామంలో రచ్చబండ కార్యక్ర మం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే కోట్ల ఆదేశించారు. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి నెలాఖ రుకల్లా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయా భివృద్ధి కోసం రూ.2 కోట్ల ప్రతిపాద నలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలి పారు. రూ.10 లక్షలతో అభిరెడ్డిపల్లె చెరువు నుంచి కాలువ పనులు చేపట్టి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అలాగే విద్యుత సరఫరా, వైద్యసదుపాయాల మెరుగుదల, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అభివృద్ధి అంశాలపై గ్రామస్థులతో చర్చించారు. అలాగే పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయిబాబా ఆలయం నుంచి బేతంచెర్ల రోడ్డు వరకు రింగ్ రోడ్డు ప్రతిపాదనలపై రైల్వే, మున్సిపల్, ఇరిగేషన, పంచా యతీరాజ్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ కార్యక్రమాల్లో లక్కసాగరం లక్ష్మీరెడ్డి, మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, వెంక టాపురం రామిరెడ్డి, గుమ్మకొండ శంకర్, బొంతిరాళ్ల తిరుపాల్, పవనకుమార్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, పీఆర్ ఏఈ నారాయణ, ట్రాన్సకో ఏఈ నాగేశ్వ రరెడ్డి, ఏపీవో షుకుర్ పాల్గొన్నారు.