Share News

ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:55 PM

ప్రజలు ఆరోగ్యవంతు లుగా ఉండడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.

ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి
డోన: వైద్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి

డోన టౌన, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఆరోగ్యవంతు లుగా ఉండడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని రైల్వేస్టేషన రోడ్డులోని క్లబ్‌ హౌస్‌లో బసవ తారక్‌ విండో అమెరికన క్యాన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వ ర్యంలో ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే కోట్ల ప్రారం భించి మాట్లాడారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులను ప్రారం భదశలోనే గుర్తిస్తే పూర్తిగా నియంత్రించుకోవచ్చని అన్నారు. డాక్టర్‌ రేణుక మాట్లాడుతూ ధైర్యంగా ప్రజలు ముందుకు వచ్చి ఉచిత క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొద టి రోజున 226 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారన్నారు. కార్యక్ర మంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనా యునిపల్లె శ్రీనివాసులు యాదవ్‌, చండ్రపల్లె లక్ష్మినారా యణ యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన కోట్రికే హరికిషణ్‌, టీఈ రాఘవేంద్రగౌడు, అలేబాదు పరమేష్‌, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, పెద్ద కేశవయ్యగౌడు, భూమా నాగన్న పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసమే గోకులం షెడ్లు: ఎమ్మెల్యే

ప్యాపిలి: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం గోకులం షెడ్లు నిర్మిస్తోందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మాధవరంలో రూ.10లక్షలతో నిర్మించిన 5 గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పల్లెపం డుగ 2.ఓలో భాగంగా రూ.20 లక్షలు, ఎన. రంగాపురంలో రూ.25 లక్షలతో సిమెం టు రోడ్లకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. డీసీఎంఎస్‌ చైర్మన నాగేశ్వ రరావుయాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, సీతపతిస్వామి, సీమ సుధాకర్‌రెడ్డి, ఖాజాపీర్‌, అలేబాదు పరమేష్‌, మల్లారెడ్డి, సుదర్శన, కర్ణం రామ్‌, కేసీ మద్దిలేటి, ప్రసాద్‌, దామోదర్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:55 PM