రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:31 AM
రైతులు పండించిన పంట ఉత్పత్తులకు న్యాయమైన మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకొని తద్వారా రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎమ్మిగనూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంట ఉత్పత్తులకు న్యాయమైన మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకొని తద్వారా రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జనసేన ఇనచార్జి, శ్రీశైలం ట్రస్టుబోర్డు మెంబర్ రేఖాగౌ డ్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతలు నష్టపోకూడదన్న సదుద్దేశ్యంతో మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే కందులను కూడా నాఫెడ్ ద్వారా క్వింటం రూ. 8000లకు, మినుములు రూ. 7800, పెసలు రూ. 8768ల మద్దతు ధరలకు కొనుగోలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన మల్ల య్య, కేడీసీఎంఎస్ ప్రతినిధి సత్యనారాయణ, ఏఓ శివశంకర్, మార్కెట్ సిబ్బంది నరసన్న, టీడీపీ నాయకులు ఎంబీ మహేష్, ఉరుకుందయ్య, దేవేంద్ర, భీమ, హనుమంతు, సురేంద్ర రెడ్డి, జనసేన నాయకులు రవి, కమీషన ఏజెంట్ల సంఘం నాయకులు జగన్నాథరెడ్డి, కృష్ణమూర్తి, రైతులు, వేమెన్లు, హమాలీలు పాల్గొన్నారు.