MLA: విజన ఉన్న నేత సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:48 PM
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభు త్వం మహిళల భద్రత, శిశుసంక్షేమం, బాల్య వివాహాల నిర్మూలన, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా భరోసా పింఛన అందజేస్తున్న రా ష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. అంతకు ముందు బాల్యవివాహాల నివార ణపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. తిరుచానూరు ప ద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రప్రజల కు మంచి పాలన అందాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....