రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:44 AM
రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ ఆవిష్కరణ
డోన టౌన, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. సోమ వారం ఎమ్మెల్యే కోట్ల నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం మెరుగు పడితే రైతుల ఆర్థిక స్థితి బలపడుతుందన్నారు. ఈ శిబిరాలు ఈ నెల 30 వరకు నిర్వహిస్తారని పాడి రైతులు ఈ అవకా శాన్ని వినియోగించుకోవాలని సూచించారు.