ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:22 AM
తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
ఎన్టీఆర్‌కు ఘన నివాళి
డోన టౌన, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవ స్థాపకుడు దివంగత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిద్దామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని తారక రామన గర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కోట్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మె ల్యే కోట్ల సమక్షంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, మాజీ సర్పంచ పెద్ద కేశవయ్యగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణి గౌడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, సుధీష్, చండ్ర పల్లె లక్ష్మీనారాయణ యాదవ్, వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు యాదవ్, ఆర్‌ఈ నాగరాజు, భూమా నాగన్న, పరమేష్ పాల్గొన్నారు.