Home » MLA
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్నారు. ఆంధ్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందన్నారు.
నకు ఓటు వేయని వారికి కూడా తాను ఎమ్మెల్యేను అని, అర్హులైన ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. వెంకటగిరి గ్రామంలో గురువారం రైతన్నా మీకోసం- అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రైతులకు ఓ సూచన చేశారు. రైతులంతా ఒకేసారి ఒకే రకం పంట సాగుచేస్తే గిట్టుబాటు ధరలేక నష్టాలు వస్తున్నాయని, కాబట్టి ఒకే రకం పంట కాకుండా మర్పిడి చేసుకోవాలని ఆమె సూచించారు.
గ్రామాల్లోని పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ప్రభుత్వ వైద్యులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
ఉత్తరకర్ణాటక సమస్యలపై సమగ్ర చర్చలు జరగాలనే కారణంతో ఏటా బెళగావి సువర్ణసౌధలో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుపుతున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, అందుకే ప్రభుత్వం నుంచి ఏవిధమైన జీతభత్యాలు స్వీకరించేది లేదని జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ కందకూర్ పేర్కొన్నారు.
అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్‌లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
యూసుఫ్‌గూడ గల్లీలో పెరిగిన కుర్రాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. మొదట సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపించాడు. తన ఇంట్లో ఎవరో ఒకరు రాజకీయంగా ఎదగాలని అతడి నాన్న భావించేవారు. తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.