Share News

MLA: బలిజ-కాపుల సమస్యలపై చర్చించండి

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:01 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.

MLA: బలిజ-కాపుల సమస్యలపై చర్చించండి
Kapu community leaders giving petition to MLA Sindhura Reddy

- ఎమ్మెల్యేకి బలిజ - కాపు సంఘం నాయకుల వనతి

పుట్టపర్తి రూరల్‌/కొత్తచెరువు, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ-కాపు కులస్థుల సమస్యలపై శాసనసభ స మావేశాల్లో చర్చించి పరిస్కారం చూపించాలని బలిజ సంఘం జిల్లా నాయకులు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డికి విన్నవించారు. అనంతపురం లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బలిజసంఘం నాయకులు మాట్లాడుతూ... 1960 ముందు బీసీలుగా ఉన్న కాపు బలిజలను రాజీకీయ ప్రయోజనా లతో ఓసీలుగా మార్చా రన్నారు. తిరిగి బీసీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, కాపు కార్పొరేషనకు తక్షణమే నిధులు మంజూ రుచేసి విదేశీ విద్య రుణాలు అందించే విదంగా చర్యలు తీసుకోవాలని, ఈ నెల 16న జరగనున్న శ్రీకృష్ణ దేవరాయల జయంతి ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని, పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించాలని, రాయల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలనే తదితర అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్యెల్యేను కోరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు బాలగంగాధర్‌, రాము, జనసేన పార్టీ ఓడీసీ మండల కన్వీనర్‌ జయచంద్రమోహన, గూడా సోమశేఖర్‌, సమ్మిటి చంద్ర, రామకృష్ణ, కొత్తచెరువు మార్కెట్‌యార్డు చైర్మన పూలశివప్రసాద్‌, నల్లమాడ మణికుమారి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 11 , 2026 | 12:01 AM