Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:18 AM

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం మాధవీనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. గౌరు చరితారెడ్డి మా ట్లాడుతూ పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన, రూరల్‌, ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల ప్రజలు సమ స్యలపై ఆర్జీలు అందజేశారని తెలిపారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2026 | 12:18 AM