వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:12 AM
కల్లూరు మండలంలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలంలోని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం 36, 37 వార్డుల్లో ఆమె రూ.2.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు 36వ వార్డు మల్లారెడ్డి వెంఛర్ ఫేజ్-1లో రూ.60 లక్షలతో సీసీ డ్రైన్లు, 37వ వార్డు శ్రీనివాసనగర్, భారత పెట్రోల్‌బంక్ లైనలో రూ.1.80 కోట్లతో డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గౌరు చరిత మాట్లాడుతూ నగర అభివృద్దికి అందరూ సహ కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరే షన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, కార్పొరేటర్ అయోషాసిద్దికా, క్లస్టర్ ఇనచార్జిలు రెడ్డిగారి లోకేశ్వరరెడ్డి, పీయూ మాదన్న, కాసాని మహేష్‌గౌడ్, జవ్వాజి గంగాధర్‌గౌడ్, వార్డ్ ఇనచార్జి రాఘవేంద్ర, అధికారులు పాల్గొన్నారు.