Share News

సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:06 AM

సంక్షేమం.. అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళలాంటివని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.

సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

రాజముద్రతో పట్టా పాసు పుస్తకాలు పంపిణీ

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం.. అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళలాంటివని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో రూ.68 లక్షలతో రూ.90వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంకు శిలాఫలకాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం రైతులకు రాజము ద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ రీసర్వే ద్వారా అందిస్తున్న పాసు పుస్తకాలతో రైతులకు భూములపై పూర్తి హక్కు లభిస్తుంద న్నారు. అవ్వాతాత, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై జగన రెడ్డి ఫొటోలు పెట్టుకుని రైతులపై పెత్తనం చెలాయించారని, జగన లాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదన్నారు. జగన రెడ్డి తప్పుడు విధానాలతో ప్రజల భూములను కాజేయాలని చూశారన్నారు. అనంతరం ఏపీఐఐసీలో ఆల యాలు పోతున్నాయని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ఆలయాలను సందర్శించారు. ఈ విషయంపై ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడి ఆలయాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు కుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వీ.అమల, ఎంపీడీవో నాగ అన సూయ, డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌, పంచాయతీ కార్యదర్శి గోపాల్‌, ఆర్‌డబ్లూఎస్‌ జేఈ శ్రీనివాసులు, ఏవో మధుమతి, మండల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు గోవిందరెడ్డి, సర్పం చులు అయ్యస్వామి, మోహన రెడ్డి, వెంకటరమణ, నాయకులు విశ్వేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, చంద్రపెద్ద స్వామి, కాకి దేవేంద్ర, సుధాకర్‌ రావు, నాగముని, మహబూబ్‌ బాషా, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:06 AM