Home » Minister Nara Lokesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించి.. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రి లోకేశ్ పరామర్శించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతిచెందటంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు.
విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతిపై.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం ఎంతో బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ ఎదుగుదల చూసి ఓర్వలేకే జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు.
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు.
మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ పరంగా 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ప్రతిపాదిస్తూ కీలక చర్చకు శ్రీకారం చుట్టారు.