• Home » Medaram Jatara

Medaram Jatara

కాళేశ్వరం-మేడారానికి ప్రత్యేక బస్సులు

కాళేశ్వరం-మేడారానికి ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భూపాలపల్లి డిపో పరిధిలో మొత్తం నాలుగు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ హిందు తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

కాలినడకన మేడారానికి...

కాలినడకన మేడారానికి...

మేడారం మహాజాతరకు భక్తులు కొంతమంది కాలినడకన చేరుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా పేరుందిన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో జరుగనుంది. అయితే.. కొంతమంది తమ మొక్కుల ప్రకారం మేడారానికి కాలినడకన బయలుదేరుతున్నారు.

మేడారం కిటకిట.. ఒక్కరోజే  3 లక్షల మందికు పైగా..

మేడారం కిటకిట.. ఒక్కరోజే 3 లక్షల మందికు పైగా..

భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. జాతరకు సమయం దగ్గరపడడంతో.. భక్తులు ముందస్తుగానే చేరుకుని తమతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

మేడారం మహాజాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహా జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జాతర జరిగే ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

 మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్క తల్లికి పుట్టింటి చీరను సమర్పిచారు. మహాజాతరకు ముందు సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించారు.

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగం..

మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగం..

మేడారంలో భక్తుల రద్దీ నియంత్రణకు ఏఐ వినియోగిస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారాయన. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కి అనుసంధానించి రద్దీని నియంత్రిస్తున్నట్లు వివరించారు.

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు తేదీ దగ్గరపడుతోంది. అయితే.. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు సింగరేణి యాజమాన్యం కూడా సిద్ధమైంది. అటు సింగరేణికి చెందిన రెస్క్యూ, స్విమ్మర్స్‌, స్కౌట్స్‌ సిబ్బంది మేడారంలో సేవలందించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి