Share News

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:37 PM

మేడారం మహాజాతరకు తేదీ దగ్గరపడుతోంది. అయితే.. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు సింగరేణి యాజమాన్యం కూడా సిద్ధమైంది. అటు సింగరేణికి చెందిన రెస్క్యూ, స్విమ్మర్స్‌, స్కౌట్స్‌ సిబ్బంది మేడారంలో సేవలందించనున్నారు.

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

- 56 మంది రెస్క్యూ, స్విమ్మర్స్‌, స్కౌట్స్‌ నియామకం

- జంపన్నవాగు, గద్దెల ప్రాంగణంలో విధులు

వరంగల్: మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మ జాతరకు సింగరేణి సమాయత్తమవుతోంది. ప్రతీ జాత ర లాగానే ఈసారి కూడా జరిగే జాతరలో విధులు నిర్వర్తించేందుకు మూడు విభాగాల సిబ్బందిని సింగరేణి ఎంపిక చేసింది. జాతరకు వారం రోజుల ముందు నుంచి విధుల్లో చేరి జాతర పూర్తిగా ముగిసే వరకు పని చేసేందుకు ప్రణాళికలు రూపొందించు కున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భూపాలపల్లి(Bhupalapalli) కేంద్రం నుంచి రెండు విభాగం తరలివెళ్లగా.. ఈ నెల 25వ తేదీన మరో విభాగం తరలివెళ్లేలా సిద్ధమవుతున్నారు.


మూడు విభాగాల్లో 56 మంది..

సింగరేణి ఏరియాలో మూడు విభాగాల్లో పని చేస్తున్న 56 మందిని సింగరేణి యాజ మాన్యం ఎంపిక చేసింది. వీరిలో రెస్క్యూ విభాగం నుండి 20మంది, స్విమ్మర్స్‌ 16 మం ది, స్కౌట్స్‌ విభాగం నుండి 20 మంది జాతర లో విధులు నిర్వర్తించనున్నారు. వీరందరికి సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. తల్లుల సన్నిధిలో సేవ చేసే భాగ్యం రావడం ఆనందంగా భావించాలని సూచించారు.


meda2.jpg

ప్రధాన విధులివే..

మేడారం జాతర సక్సెస్‌ కావాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే నే అది సాధ్యమవుతోంది. అయితే, కొన్ని ప్రధాన శాఖల్లోని వారు ఎంతో బాధ్యతాయు తంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరి విధుల నిర్వహణతోనే వచ్చే భక్తులకు సేవలు అందనున్నాయి. అయితే, కొన్ని ప్రధాన శాఖ ల అధికారులు, సిబ్బంది మరింత సమర్థతతో పని చేయాల్సి ఉంటుంది. ఇదే తరహాలో సింగరేణిలో పనిచేసే ఈ మూడు విభాగాల సిబ్బంది విధులు సైతం కీలకమే కానున్నా యి. విధులకు తరలివెళ్లే రెస్క్యూటీమ్‌ 20మంది గద్దెల ప్రాంగణంలో విధులు ఉండనున్నారు. ఇక్కడ భక్తులకుఎదరయ్యే సమస్యలపై వీరు సత్వరమే స్పందించనున్నారు.


meda2.3.jfif

ప్రధానంగా ఏదైన అనుకొని ప్రమాదం జరిగితే ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం, సీపీఆర్‌ చేయడం, త్వరితగతిన వైద్య సదుపాయం అందించేలా చూడటం వంటివి చేస్తారు. అలాగే, 16 మంది స్విమ్మర్స్‌ జంపన్న వాగులో ఉంటూ ప్రమాదమేమైనా చోటు చేసుకుంటే వెంటనే స్పందించనున్నారు. నిరంతరాయంగా ఈ స్విమ్మర్స్‌ విధులు ఉండనున్నాయి. ఇక స్కౌట్స్‌ సిబ్బంది జంపన్నవాగు సమీపంలోనే అందుబాటులో ఉంటూ తలనీలాలు సమర్పించే వారు నీళ్లలో వాటిని వేయకుండా, క్యూలైన్లో వేచి చూసేవారికి వాటర్‌ బాటిళ్లు అందించడం, పరిసరాలను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించే ప్రధాన విధులు వీరంతా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 12:37 PM