Home » Medaram Jatara
వెయ్యేళ్ల చరిత్ర గల మేడారం దేవాలయ విశిష్టత మరో వెయ్యేళ్లపాటు వెలుగొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ మేరకు మేడారం కీర్తి, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు.
మేడారం జాతరపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీతక్క కౌంటర్ ఇచ్చారు. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 13వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా మేడారం అభివృద్ధి పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని, ఈ మేరకు మహాజాతరను నిర్వహించనున్నట్లు మంత్రులు మంత్రి కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు సదుపాయాల కల్పనలో భాగంగా రైల్వే లైన్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ముహూర్తం ఖరారైంది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగుతుందని దేవస్థాన కార్యనిర్వాహక
Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.