Home » Mamata Banerjee
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో మంగళవారంనాడు బైఠాయింపు దీక్షకు దిగారు.
టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులపై నిరసన తెలిపేందుకు తమ పార్టీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్టు ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో 'పోలీస్ రాజ్యం' నడుస్తోందని ఆరోపించారు.
మమతా బెనర్జీ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ పడిన దృశ్యాల తాలూకా మరో వీడియోను బీజేపీ నేత డెబ్‌జిత్ సర్కార్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. ఆ వీడియోలో మమతా బెనర్జీ స్పష్టంగా కనిపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనాపూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనాపూర్‌లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. మేనల్లుడిని పరామర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్.. పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని చవిచూడటంతో పార్టీని కొత్తగా నిర్మించాలని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉండవచ్చని, వద్దనుకునే వాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు.
బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల విషయంలో పోలీసులపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతాబెనర్జీ విరుచుకుపడ్డారు.