ఆస్పత్రి సీఈఓతో గొడవ పడిన మమత.. వెలుగులోకి మరో వీడియో..
ABN , Publish Date - Jun 01 , 2026 | 07:07 AM
మమతా బెనర్జీ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ పడిన దృశ్యాల తాలూకా మరో వీడియోను బీజేపీ నేత డెబ్‌జిత్ సర్కార్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. ఆ వీడియోలో మమతా బెనర్జీ స్పష్టంగా కనిపిస్తున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. స్థానికుల దాడిలో గాయపడ్డ అభిషేక్‌ను ఆయన సిబ్బంది స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అక్కడినుంచి బెల్ వ్యూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అభిషేక్‌పై దాడి జరిగిందని, బెల్ వ్యూ ఆస్పత్రికి తీసుకెళ్లారని మమతా బెనర్జీకి తెలిసింది. ఆమె హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ పడ్డారు.
మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈఓ ప్రదీప్ టాండన్‌తో గొడవకు దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో మమతా బెనర్జీ.. ప్రదీప్‌కు వార్నింగ్ ఇస్తున్న వాయిస్ మాత్రమే ఉంది. ఆ వీడియోలో.. ‘టాండన్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు చేసిన సాయాన్ని దయచేసి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించడు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. రేపు ఉండదు. అప్పుడు మేము చేయాల్సింది చేస్తాం’ అని మమతా అన్నట్లుగా ఉంది.
మరో వీడియో విడుదల చేసిన డెబ్‌జిత్
మమతా బెనర్జీ ఆస్పత్రి యాజమాన్యంతో గొడవ పడిన దృశ్యాల తాలూకా మరో వీడియోను బీజేపీ నేత డెబ్‌జిత్ సర్కార్ తన ఎక్స్ ఖాతాలో విడుదల చేశారు. ఆ వీడియోలో మమతా బెనర్జీ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో అభిషేక్‌ను స్ట్రెచర్‌పై తరలిస్తుండగా.. వెనకాల మమతా బెనర్జీ ఉన్నారు. ఆస్పత్రి సీఈఓ ప్రదీప్ టాండన్‌పై ఆమె ఫైర్ అవుతున్నారు. ఆ సమయంలో ఆమెతో పాటు అక్కడ చాలా మంది ఉన్నారు. 39 సెకన్ల ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
టైటిల్‌తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్
తూర్పుడెల్టా కాలువకు సాగునీరు విడుదల