Share News

తూర్పుడెల్టా కాలువకు సాగునీరు విడుదల

ABN , Publish Date - Jun 01 , 2026 | 06:26 AM

రబీ అనంతరం మూసివేసిన డెల్టా కాలువలకు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు.

తూర్పుడెల్టా కాలువకు సాగునీరు విడుదల

ధవళేశ్వరం, మే 31(ఆంధ్రజ్యోతి): రబీ అనంతరం మూసివేసిన డెల్టా కాలువలకు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేశ్‌, ఎంపీలు సానా సతీశ్‌, గంటి హరీశ్‌ మాధుర్‌, తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ మురాలశెట్టి సునీల్‌కుమార్‌.. తూర్పు డెల్టా హెడ్‌ స్లూయి్‌సపై పూజలు నిర్వహించి గోదావరి మాతకు పూలు పండ్లు సమర్పించి, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

Updated Date - Jun 01 , 2026 | 06:27 AM