Share News

హెల్మెట్ లేకపోతే అభిషేక్ చనిపోయేవాడు.. మమతా బెనర్జీ ఆవేదన

ABN , Publish Date - May 31 , 2026 | 09:22 AM

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనాపూర్‌లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. మేనల్లుడిని పరామర్శించారు.

హెల్మెట్ లేకపోతే అభిషేక్ చనిపోయేవాడు.. మమతా బెనర్జీ ఆవేదన
Abhishek Banerjee attack

కోల్‌కతా, మే 31: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్‌లోని సోనాపూర్‌లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. శనివారం సౌత్ 24 పరగణాస్‌లో పార్టీ కార్యకర్తలను కలవడానికి వెళ్లిన ఆయనపై స్థానికులు విచక్షణా రహితంగా దాడి చేశారు. స్థానికుల దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడ్డారు. సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. అల్లుడిని పరామర్శించారు.


ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము వీడియోలో చూశాము. పక్కన ఉన్న యువకుడు హెల్మెట్ ఇచ్చాడు. హెల్మెట్ ఇవ్వకపోయి ఉంటే అభిషేక్ స్పాట్‌లోనే చనిపోయేవాడు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం నిజంగా లేకపోతే.. డాక్టర్లు అతడిని ఐటీయూలో రెండు గంటల పాటు ఎందుకు ఉంచుతారు. డాక్టర్లు చాలా టెస్టులు, స్కాన్‌లు చేశారు. అభిషేక్‌ను పరీక్షించిన డాక్టర్లు శరీరంపై చాలా గాయాలను గుర్తించారు. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం అతడి ముఖం, వీపు, రొమ్ము, మెడపై లోతైన గాయాలు అయ్యాయి’ అని అన్నారు.
mamata.jpg


డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు..

ఆమె కొనసాగిస్తూ.. ‘ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. గాయాలైన వ్యక్తికి చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై, ఆస్పత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలి. హింస, ఆయుధాలు, భయంతో రాజకీయాలకు సమాధానం చెప్పకూడదు. నమ్మకస్థులైన డాక్టర్లు, ఫ్యామిలీ ఫిజీషియన్స్ అధ్వర్యంలో అభిషేక్‌కు చికిత్స అందిస్తాం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 31 , 2026 | 10:46 AM