Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 31 , 2026 | 08:02 AM

ఈ వారం రాశిఫలాలు.. 31 మే - 6 జూన్‌ 2026.

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. తొందరపాటు నిర్ణయం తగదు. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. మనోధైర్యంతో మెలగండి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరచరాస్తి వ్యవహారంలో పునరాలోచన శ్రేయస్కరం. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgసంప్రదింపులు ఫలిస్తాయి. రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ప్రతి పాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgఅన్నివిధాలా కలిసివచ్చే సమ యం. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవు తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఆప్తుల కలయిక వీలు పడదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. కన్సల్టెన్సీ లను విశ్వసించవద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఒక సమాచారం సందిగ్ధానికి గురిచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgలక్ష్యానికి చేరువలో ఉన్నారు. నిరుత్సాహం వీడి యత్నాలు కొనసాగించండి. స్థిరచరాస్తుల మూల ధనం అందుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా ఎట్టకేలకు పూర్తికాగలవు. ప్రేమానుబంధాలు బలపడతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్ని స్తారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. ఉల్లాసంగా గడుపుతారు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgవేడుకను ఆర్భాటంగాచేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీ తం. పరిచయస్తుల రాకపోకలు అధికమవు తాయి. కీలక పత్రాలు సమయానికి కనిపిం చవు. చీటికిమాటికి చికాకుపడతారు. పట్టుదలకు పోవద్దు. ఇంటివిషయాలపై శ్రద్థ వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgపరిస్థితులు క్రమంగా చక్క బడతాయి. లక్ష్యం సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వివాహ య త్నం ఫలించే సూచనలున్నాయి. కీలకపత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగి స్తుంది. వివాదాలు మరింతజటిలమవుతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgకార్యానుకూలత ఉంది. లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలి స్తుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. సావకాశంగాపనులు పూర్తిచేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. అప్ర మత్తంగా ఉండాల్సిన సమయం. అందరితో మితంగా సంభాషించండి. కీలక విషయాలు వెల్లడించవద్దు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgవ్యవహారజయం, కార్యసిద్థి ఉన్నాయి. ధనలాభం ఉంది. విలాస వస్తు వులు కొనుగోలు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. సభ్యత్వం స్వీకరిస్తారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgకొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. కలసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలకు తావివ్వవద్దు. ేస్నహసంబంధాలు బలపడతాయి. మీ ఉన్న తిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ సమస్యను ఆప్తులకు తెలియజేయండి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgసర్వత్రా అనుకూలదాయకం. లావాదేవీల్లో తగిన నిర్ణయం తీసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు సజావుగా సాగు తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణుల సలహా పాటించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. అందరితోనూ కలుపుగోలుగా మెలుగుతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుం టారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశం కలిసివస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మధ్యవర్తులను ఆశ్రయించ వద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgవ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ప్రణా ళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. అందరితో మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం కొనాలనుకుంటున్నారా..

ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 31 , 2026 | 08:11 AM