Share News

నిరుద్యోగ యువతపైనా వైసీపీ గొడ్డలి వేటు

ABN , Publish Date - May 31 , 2026 | 06:52 AM

మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు టీడీపీ దీటుగా సమాధానం ఇచ్చింది. ‘నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు’ పేరిట శనివారం తిరుపతిలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

నిరుద్యోగ యువతపైనా వైసీపీ గొడ్డలి వేటు

  • మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలపై టీడీపీ నేతల మండిపాటు

తిరుపతి సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు టీడీపీ దీటుగా సమాధానం ఇచ్చింది. ‘నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు’ పేరిట శనివారం తిరుపతిలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, రాంగోపాల్‌ రెడ్డి వైసీపీ అసత్య ఆరోపణలుపై తీవ్రంగా స్పందించారు. రవి నాయుడు మాట్లాడుతూ ‘వైసీపీ నాయకుల వలే నిరుద్యోగుల రక్తపుకూడు తినాల్సిన ఖర్మ టీడీపీ నేతలకు లేదు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో వైసీపీకి తెలియడంలేదు. క్రీడా కోటాలో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు సర్టిఫికెట్లను శాప్‌ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మంజూరు చేయదు. క్రీడా సంఘాలు, సమాఖ్యలు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తాయన్న పరిజ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదు’ అని పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన పలువురు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ నాయకులు తమను అవహేళన చేస్తూ మాట్లాడడం తగదన్నారు. స్వార్థ రాజకీయాలకోసం తమను బలిపశువులు చేయవద్దని పలువురు మహిళా ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated Date - May 31 , 2026 | 06:54 AM