Share News

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఐదుగురి అరెస్టు..

ABN , Publish Date - May 31 , 2026 | 12:29 PM

పశ్చిమ బెంగాల్‌‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఐదుగురి అరెస్టు..

పశ్చిమ బెంగాల్‌: దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై నిన్న (శనివారం) దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో ఒకరు మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ అభిషేక్ వెళ్లారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. చెప్పులు, రాళ్లు, గుడ్లు విసిరి అనంతరం భౌతికదాడికి పాల్పడ్డారు. పోలీసుల సహాయంతో ఎట్టకేలకు వారి దాడి నుంచి ఎంపీ బయటపడ్డారు.


మమతా బెనర్జీ ఫైర్..

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడిని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నేతపై గుడ్లు, రాళ్లు విసరడంపై ఆమె నిప్పులు చెరిగారు. ఈ మేరకు దాడి ఘటన వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకులు హంతకులుగా మారారని బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆరోపణలు గుప్పించారు. ఇందుకు కాషాయ పార్టీ సిగ్గుపడాలని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. బాబాగా మారాలని ప్రైవేట్‌ పార్ట్‌ని కట్ చేసుకున్నాడు..

ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌.. హత్య కేసు నిందితుడి హతం..

Updated Date - May 31 , 2026 | 12:47 PM