Home » Mahesh Kumar Goud
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం వీలున్న అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఈ నెల 23న సమావేశం కానుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
ఆనాడు బ్రిటీష్ పాలకుల అడుగులకు మడుగులు వత్తి స్వాతంత్య్రం వద్దు, బ్రిటన్ వారే ముద్దన్న ఆర్‌ఎ్‌సఎస్ వారసులే ఈనాడు దేశాన్ని ఏలుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
జనహిత పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చేపట్టిన పాదయాత్ర ఈ నెల 24న పునః ప్రారంభం కానుంది.
ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు బీజేపీ ఫ్రంటల్ ఆర్గనేషన్‌గా మారిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆక్షేపించారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహుల ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు అని ఉద్ఘాటించారు. కులాల, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని మహేష్ గౌడ్ విమర్శించారు.
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పగలంతా ముస్లింలను తిడతారని, సాయంత్రమైతే వాళ్ల జపం చేస్తారని ఆరోపించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో చేపట్టిన కుల సర్వేను చూసి ప్రధాని మోదీ ముఖం చాటేశారని, అమిత్ షా ఇంట్లో దాక్కున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఈ పాదయాత్రపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు చేరువయ్యేందుకే పాదయాత్రలు చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.