Home » Maharashtra
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూసిన ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతిని తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత అది పథకం ప్రకారం జరిగిన హత్య అని గుర్తించారు.
టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ మహారాష్ట్ర అసెంబ్లీలో సందడి చేశాడు. అతడి బాల్య స్నేహితుడు విక్రమ్ కాకడే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరీలు కలిసే కేతన్‌ను లోయలోకి తోసేసినట్లు పోలీసులు తేల్చారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. ఉద్ధవ్ సేనకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు.
మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శివసేన (యూబీటీ)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలు మరోసారి మారే అవకాశముంది.
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మానవత్ తాలూకా యశ్వాడిలో నిర్మాణంలో ఉన్న త్రిమూర్తి హనుమాన్ దేవాలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
రెండు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న పావన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, పద్మసింహ్ పాటిల్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా తాజాగా శరద్ పవార్ ఎన్‌సీపీ-ఎస్పీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.