Share News

Maharashtra Civic Body Elections: జోరుగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు.. ఓటేసిన పలువురు ప్రముఖులు..

ABN , Publish Date - Jan 15 , 2026 | 10:24 AM

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు గురువారం ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Maharashtra Civic Body Elections: జోరుగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు.. ఓటేసిన పలువురు ప్రముఖులు..
Maharashtra Civic Body Elections

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ జోరుగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు గురువారం ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3.48 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది (Maharashtra politics).


ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. గాంధీ శిక్షణ్ భవన్‌లో ఓటేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బీజేపీ నేత ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ కూడా తమ కుటుంబసభ్యులతో కలిసి ఓట్లు వేశారు (Maharashtra civic elections live updates).


రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లతో పోల్చుకుంటే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి (Mumbai municipal polls). ఈ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రే సోదరులు కలిసి పోటీ చేస్తుండడం విశేషం. ముంబైలోని 227 స్థానాల్లో 1700 మంది పోటీ చేస్తున్నారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఇవి కూడా చదవండి..

చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 15 , 2026 | 11:30 AM