Maharashtra Civic Polls: మోటార్‌సైకిల్ నడిపిన సీఎం.. ఎన్నికల ప్రచారానికి తెర
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:15 PM
మహాయూతి కూటమి రోడ్‌షో సందర్భంగా బడ్కాస్ చౌక్‌ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ చౌక్ నుంచి 200 మీటర్ల దూరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది.
నాగపూర్: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల (Maharashtra Civic Polls) ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) నాగపూర్ (Nagpur)లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మోటారుసైకిల్ నడుపుతూ సీఎం సందడి చేశారు. భారత్ మాతా చౌక్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్‌షో మహల్ ఏరియాలోని శివాజీ విగ్రహం వరకూ సాగింది.
బీజేపీ రోడ్‌షో సందర్భంగా బడ్కాస్ చౌక్‌ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ చౌక్ నుంచి 200 మీటర్ల దూరంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది. ముఖ్యమంత్రి రోడ్‌షోకు మందు ఇదే మార్గంలో ఆర్ఎస్ఎస్ చీఫీ మోహన్ భగవత్ కాన్వాయ్ కూడా వెళ్లింది. రోడ్‌షో మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, తదితర సీనియర్ నేతల పోస్టర్లు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు.
మంబై మేయర్ పదవి బీజేపీకే
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోనూ మహాయుతి కుటమి విజయం సాధించనుందని, ముంబై మేయర్ పదవిని తమ కూటమి చేపడుతుందని దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సందర్భంగా తెలిపారు. బీజేపీ చేపట్టిన పనులు, ప్రగతిని నాగపూర్ ప్రజలు చూశారని, గతంలో విపక్షాలు కేవలం మాటలకే పరిమితమై ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. బీఎంసీ సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈనెల 15న పోలింగ్ జరుగునుంది. 16న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి