BMC Polls: ముంబై బిగ్‌బాస్‌గా అవతరించనున్న మహాయుతి.. ఠాక్రేలకు ఎదురుదెబ్బ
ABN , Publish Date - Jan 16 , 2026 | 09:28 PM
దేశంలోని అతి సంపన్నపైన మున్సిపల్ కార్పొరేషన్లలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఒకటి. బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ.74,000 కోట్లకు పైనే ఉంది. మహాయుతి కూటమితో పాటు ఠాక్రే కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి.
ముంబై: దాదాపు 25 ఏళ్లుగా బీఎంసీ (BMC)పై పట్టు సాగిస్తున్న ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు ఎదురుదెబ్బ తగిలింది. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి (Mahayuti) ఘనివిజయం దాదాపు ఖాయమైంది. శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకూ వెలువడిన ఫలితాల్లో బీఎంసీలోని వార్డుల్లో 'మహాయుతి' కూటమి హవా సాగిస్తోంది. మొత్తం 227 వార్డుల్లో బీజేపీ-శివసేన కూటమి 110 వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ 84, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 26 వార్డుల్లో ముందజంలో ఉన్నాయి. శివసేన కూటమి 65 స్థానాల్లో ఆధిక్యత సాగిస్తోంది. మరికొన్ని వార్డులకు లెక్కింపు జరుగుతోంది. దీంతో ముంబై 'బిగ్‌బాస్'గా మహాయుతి కూటమి అవతరించడం దాదాపుగా ఖాయమైంది.
దేశంలోని అతి సంపన్నపైన మున్సిపల్ కార్పొరేషన్లలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఒకటి. బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ.74,000 కోట్లకు పైనే ఉంది. మహాయుతి కూటమితో పాటు ఠాక్రే కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి. రెండు దశాబ్దాలుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఠాక్రే సోదరులు ఇటీవల ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. బీఎంసీ ఎన్నికల్లోనూ సమష్టిగా బరిలోకి దిగారు. బీఎంసీలోని 227 స్థానాలకు 1,700 అభ్యర్థులు బరిలోకి దిగారు. కారణాంతరాల వల్ల తొమ్మదేళ్ల నాలుగు నెలల జాప్యంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా బీజేపీ ఎన్నికలు 2017లో జరగగా, అవిభక్త శివసేన (ఏక్‌నాథ్ షిండేతో కలిసి) తన పట్టు నిలుపుకొంది.
పీఎం అభినందలు
బీఎంసీతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్‌లో మహాయుతి కూటమి గెలుపునకు చేరువకావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేసారు. ఎన్డీయేతో రాష్ట్ర ప్రజలకున్న అనుబంధానికి ఇది సంకేతమని అన్నారు. అలెయెన్స్ ట్రాక్ రికార్డు, అభివృద్ధి విజన్‌కు ఇది నిదర్శమని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమార్తెలు ఓటమి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి