Jalna Civic Poll: గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:00 PM
బీజేపీ, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులపై పాంగార్కర్ 2,621 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ వార్డు నుంచి షిండే సారథ్యంలోని శివసేన తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జాల్నా కార్పొరేషన్‌లోని 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీకాంత్ పాంగార్కర్ (Shrikant Pangarkar) విజయం సాధించారు. 2017లో ముంబైలో సంచలనం సృష్టించిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ (Gauri Lankesh) హత్య కేసులో శ్రీకాంత్ పాంగార్కర్ నిందితుడిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఆయన బీజేపీ, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులపై 2,621 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ వార్డు నుంచి షిండే సారథ్యంలోని శివసేన తమ అభ్యర్థిని నిలబెట్టలేదు.
పాంగార్కర్ 2001 నుంచి 2006 వవరకూ అవిభక్త శివసేన నుంచి కార్పొరేటర్‌గా సేవలందించారు. 2011లో టిక్కెట్ నిరాకరించడంతో ఆయన హిందూ జనజాగృతి సంస్థలో చేరారు. 2018లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాటు బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న క్రమంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ ఆయనను అరెస్టు చేసింది. పేలుడు పదార్ధాల చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ అరెస్టు జరిగింది. అయితే 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో పాంగార్కర్ చేరారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని షిండే నిలిపివేశారు.
జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్‌ను 2017 సెప్టెంబర్ 5న ఆమె నివాసంలో దుండగలు కాల్చిచంపారు. ఈ హత్య సంచలనం సృష్టించింది. భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని, దేశంలో రాజకీయ అసహనం పెరిగిపోయిందంటూ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో నిందితుడిగా అరెస్టయిన పాంగార్క్‌కు 2024 సెప్టెంబర్ 4న కర్ణాటక హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..
ఓటు చోరీ ముమ్మాటీకీ దోశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ
20న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన.. నితిన్ నబీన్ ఎన్నికకు మార్గం సుగమం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి