Home » Maharashtra
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు.
ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. లోహగఢ్ కోట వద్ద లభ్యమైన కేతన్ మృతదేహంపై ఉన్న గాయాలు ఈ హత్యలోని క్రూరత్వాన్ని తెలియజేస్తాయి.
మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది.
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాబోయే భార్య సియా గోయల్, చేతన్ చౌధరితో ప్రేమలో ఉందనే విషయం కేతన్ అగర్వాల్‌కు ఏమాత్రం తెలియదని ఆయన తండ్రి విశాల్ అగర్వాల్ తెలిపారు. అయితే సియా ఫోన్ గంటల తరబడి బిజీగా ఉండటంతో ఏదో తేడాగా ఉందని మాత్రం కేతన్‌కు అనిపించిందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.