Home » Maharashtra
ఇండోర్‌లో జరిగిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. రాహుల్ స్టాండ్-అప్ కమెడియన్‌గా మారితే మంచి ఉపాధి లభిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. శనివారం నాడు పుణె కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్‌ను సమర్పించారు.
మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. స్టాక్‌హోమ్ సిటీ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమె.. దేశంతో పాటు నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో వీధికుక్కల బెడదపై స్థానికులు ఒక వినూత్న నిరసనను చేపట్టారు. నిఫాద్ నగర పంచాయతీ పరిధిలో వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి.
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో తన పేరు పేర్కొనడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరా తన భూమిని తిరిగి దక్కించుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఆయనకు ఊరట లభించింది.
బ్యాంక్ సిబ్బంది కంట్లో కారం కొట్టి.. ఓ వ్యక్తి కౌంటర్‌లో నగదును దోచేశాడు. అయితే సిబ్బంది అతణ్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే...
మహారాష్ట్రలోని లోహగఢ్ కోట వద్ద నమోదైన కేతన్ అగర్వాల్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. కేతన్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పటికే అరెస్టు అయ్యారు.
వంట విషయంలో గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ భర్త తన భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది.