ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:31 PM
లెజిస్లేటివ్ బిల్డింగ్‌లో శనివారంనాడు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్‌సీపీ మంత్రి ఛగన్ భుజ్‌బుల్ బలపరిచారు.
ముంబై: దివంగత ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ సతీమణి, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ (Sunetra Pawar) ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత (party legislative leader)గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లెజిస్లేటివ్ బిల్డింగ్‌లో శనివారంనాడు ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సునేత్ర పేరును ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ప్రతిపాదించగా, ఎన్‌సీపీ మంత్రి ఛగన్ భుజ్‌బుల్ బలపరిచారు. అనంతరం ఏకగ్రీవంగా పార్టీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర ఎన్నికయ్యారు. అజిత్ పవార్ స్థానంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మహారాష్ట్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్టు నెలకొల్పనున్నారు.
సునేత్ర పవార్ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ అంతగా ప్రచారంలోకి రాలేదు. ఆ ఏడాది బారామతి నుంచి ఎన్‌సీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. అయితే ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే చేతిలో ఆమె ఓడిపోయారు. అనంతరం రాజ్యసభకు సునేత్ర ఎన్నికయ్యారు.
అజిత్ పవార్ మరణాంతరం ఎన్‌సీపీ వర్గాలు విలీనం కానున్నాయనే ప్రచారం జరిగింది. మహాయుతి కూటమిలో సునేత్ర చేరుతారా లేదా అనేది తమకు తెలియదని ఎన్‌సీపీఎస్‌పీ, శరద్ పవార్ కుటంబ సభ్యులు తెలిపారు. అజిత్ పవార్ కుటుంబం, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీజేపీ సపోర్ట్ చేస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. సునేత్ర ప్రమాణస్వీకారం విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందని శరద్ పవార్ మీడియాకు శనివారంనాడు తెలిపారు. ఎన్‌సీపీ, ఎన్‌సీపీఎస్‌పీ వర్గాలు విలీనం కావాలని అజిత్ పవార్ ఆశించారని, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయని వివరించారు.
ఇవి కూడా చదవండి..
నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్
రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?
For More National News And Telugu News