Home » Maharashtra
బీఎంసీ మేయర్ పోస్టును లాటరీ పద్ధతిలో మహిళకు కేటాయించారు. జనవరి 31న ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే, బీజేపీ, శివసేన కార్పొరేటర్లు గ్రూప్ రిజిస్ట్రేషన్లను ఫైనలైజ్ చేయకపోవడంతో మేయర్ ఎన్నికల ప్రక్రియలో అవాంతరం తలెత్తింది.
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టు జనరల్ మహిళ కేటగిరీకి రిజర్వ్ అయింది. అయితే బీఎంసీ లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్‌ను దాటి స్పష్టమైన విజయం సాధించిది. అయితే మేయర్ పదవికి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దాబా యజమాని ఓ కస్టమర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఎంఎన్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్థానిక నేతలను రాజ్ ఠాక్రే సూచించారు. దీంతో కల్యాణ్-డోంబివిలి ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని షిండే శివసేనకు మద్దతివ్వాలని స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిని దాదాపు 125 మంది అస్వస్థతకు గురయ్యారు. విందు ఆరగించిన వారికి ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి, వికారం రావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
బీఎంసీ ఎన్నికల్లో పాతికేళ్ల తర్వాత శివసేన ఆధిపత్యానికి బీజేపీ-షిండే శివసేన కూటమి గండికొట్టింది. అయితే.. మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం ఇంతటితో ముగిసినట్టు కాదని.. మరాఠా ప్రజలకు సముచిత గౌరవం దక్కేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన(యూబీటీ) తెలిపింది.
బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.
దేశంలోని అతి సంపన్నపైన మున్సిపల్ కార్పొరేషన్లలో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఒకటి. బీఎంసీ వార్షిక బడ్జెట్ రూ.74,000 కోట్లకు పైనే ఉంది. మహాయుతి కూటమితో పాటు ఠాక్రే కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి.
మున్సిపల్ ఎన్నికల్లో చెరగని సిరాకు బదులుగా మార్కర్ పెన్ వాడారని, ఇందువల్ల ఓటర్ల చేతికి వేసిన ముద్రను తేలిగ్గా చెరిపివేసేందుకు వీలుంటుందని, ఇది బోగస్ ఓట్లకు దారితీస్తుందని పలు విపక్ష పార్టీలు గురువారంనాడు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాహుల్ తొలిసారి స్పందించారు.