Share News

Eagle Team Focus on Pharma Companies: డెకాయ్ ఆపరేషన్.. ఫార్మా కంపెనీలపై స్పెషల్ ఫోకస్

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:15 AM

మహారాష్ట్రలో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ ఈగల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన డెకాయ్ ఆపరేషన్ సంచలనంగా మారింది. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ను చేదించిన తెలంగాణ ఈగల్ పోలీసులు..

Eagle Team Focus on Pharma Companies: డెకాయ్ ఆపరేషన్.. ఫార్మా కంపెనీలపై స్పెషల్ ఫోకస్
Eagle Team Focus on Pharma

మహారాష్ట్రలో డ్రగ్స్ ముఠాలపై తెలంగాణ ఈగల్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన డెకాయ్ ఆపరేషన్ సంచలనంగా మారింది. ఫార్మా కంపెనీల ద్వారా డ్రగ్స్ తయారీ, హవాలా వ్యవహారాలతో భారీ నెట్‌వర్క్ నడుపుతున్న ముఠా గుట్టును ముంబైలో తెలంగాణ ఈగల్ టీం పోలీసులు రట్టు చేశారు. వారం రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ఈగల్ టీం.. డ్రగ్స్-హవాలా నెట్‌వర్క్‌ను చేదించింది. 24 మందిని అదుపులోకి తీసుకున్న ఈగల్ పోలీసులు వారిని విచారిస్తున్నారు.


పూణేలో డ్రగ్స్ ఫ్యాక్టరీలు సీజ్

ఈ కేసులో భాగంగా గతంలో పూణేలో మూడు డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలను సీజ్ చేశారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును ముంబై మీదుగా నైజీరియా తరలించినట్లుగా పలు బ్యాంకు ఖాతాలను ఈగల్ టీం అధికారులు గుర్తించి వాటిపై విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు ఎంత పెద్ద మొత్తంలో నగదు తరలించారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ ద్వారా తెలంగాణలో ఎవరికి విక్రయాలు జరిపారనే వివరాలపై ఆరా తీస్తున్నారు.


అదుపులో వ్యాపారవేత్తలు

ఇప్పటివరకు అరెస్టయినవారిలో ముంబైకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. వారి పాత్ర ఏమిటి, డ్రగ్స్ సరఫరా వ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎంతవరకు ఉందో తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.


ఈగల్ టీం వ్యూహాత్మక దాడులు

ఈ మొత్తం ఆపరేషన్ తెలంగాణ ఈగల్ టీం పక్కా వ్యూహంతో, తక్కువ సమయంలో ప్రముఖ నగరాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాలను గుర్తించింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ పాకిన విధానం చూస్తే, ఇది దేశవ్యాప్తంగా విస్తరించిన ముఠాగా నిపుణులు భావిస్తున్నారు. ఫార్మా కంపెనీల పేరుతో జరుగుతున్న డ్రగ్స్ తయారీ, హవాలా మనీ లాండరింగ్, అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు ..ఇవన్నీ కలిపి, ఈ కేసు మరింత సంచలనంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.


Also Read:

వాయు కాలుష్యం ఎఫెక్ట్..1000 రోజులు తగ్గుతున్న జీవితకాలం

ఐటీ కారిడార్‌లో.. మళ్లీ ట్రాఫిక్‌ కష్టాలు

For More Latest News

Updated Date - Sep 09 , 2025 | 09:33 AM