Hyderabad: ఐటీ కారిడార్‌లో.. మళ్లీ ట్రాఫిక్ కష్టాలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:00 AM
వాహనంలో ఐటీ కారిడార్‌కు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ మార్గంలో వచ్చినా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం ట్రాఫిక్ జామ్‌లు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి.
- ఐటీ కారిడార్‌లో మొదలైన ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ: వాహనంలో ఐటీ కారిడార్(IT Corridor)కు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ మార్గంలో వచ్చినా ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం ట్రాఫిక్ జామ్‌లు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో పది రోజులుగా ట్రాఫిక్ సమస్యలు అంతగా కనిపించలేదు. సోమవారం మళ్లీ ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య వాహ నాలు బారులుదీరాయి. ఉదయం మియాపూర్ నుంచి అల్విన్ చౌరస్తా మీదుగా హఫీజ్‌పేట, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి(Kondapur, Madhapur, Gachibowli), ఫైనాన్సియల్ డి స్ర్టిక్ట్ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడ్డారు.

జేఎన్‌టీయూ నుంచి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ మీదుగా సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ వైపు వచ్చే మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. గచ్చిబౌలి అంజయ్య నగర్, కొండాపూర్, బొటానికల్ గార్డెన్ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. ఆఫీసులకు వెళ్లే సమయాల్లో అందరూ ఒకేసారి ప్రధాన మార్గాల్లోనే రాకపోకలు సాగిస్తుండడం వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో అప్‌డేట్‌లు
ఐటీ కారిడార్ వైపు రాకపోకలు సాగించే వారిలో మెజారిటీ వాహనదారులంతా ఐటీ ఉద్యోగులు ఉంటున్నారు. దీంతో వారికి ట్రాఫిక్ పరిస్థితులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్‌మీడియా వేదికగా అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాలని సూచిస్తున్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ మెసేజింగ్ సర్వీసు ద్వారా అప్రమత్తం చేస్తున్నా చాలామందికి ప్రత్యామ్నాయ మార్గాలు తెలియకపోవడంతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. సొంత వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సులు, మెట్రోరైలు, కార్ పూలింగ్ ద్వారా ఉద్యోగులు కంపెనీలకు రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News