Air Pollution effects Youth Health: వాయు కాలుష్యం ఎఫెక్ట్..1000 రోజులు తగ్గుతున్న జీవితకాలం
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:38 AM
ఢిల్లీలో ఇటీవల రెస్పికాన్ 2025 అనే సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని యువత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో వాయు కాలుష్యం తీవ్రమైన ముప్పుగా మారింది. ఢిల్లీలో ఇటీవల రెస్పికాన్ 2025 అనే సదస్సు నిర్వహించారు. అయితే, ఈ సదస్సులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలోని యువత ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. వాయు కాలుష్యం వల్ల అనేక రకాల శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. చెడు గాలి, బయోమాస్ ఇంధనం వాడకం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల యువతలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ టిబి రిపోర్ట్ 2024 ప్రకారం, 2022లో భారతదేశంలో ప్రతి లక్ష జనాభాకు 199 కొత్త టిబి కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు, పెరుగుతున్న న్యుమోనియా కేసులపై కూడా దృష్టి సారించారు. ప్రపంచవ్యాప్తంగా, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు న్యుమోనియా కారణంగా ఉందని, దీని రేటు 14% ఉందని వెల్లడించారు.
తగ్గుతోన్న యువత జీవితకాలం
ఈ పెరుగుతున్న కేసుల వెనుక వాయు కాలుష్యం, కలుషితమైన వాతావరణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల యువత ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. విషపూరితమైన గాలి భారతీయుల సగటు జీవితకాలాన్ని సుమారు 1,000 రోజులు తగ్గిస్తోందని సమావేశంలో సంచలన విషయాలు చర్చించారు. స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 నివేదిక ప్రకారం, భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ప్రజల సగటు ఆయుర్దాయం 1.5 నుండి 2 సంవత్సరాలు (అంటే సుమారు 1000 రోజులు) తగ్గుతోంది. యువత ఆరోగ్య భవిష్యత్తుపై ఇది ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు.
కాలుష్యం ఎఫెక్ట్
యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ప్రతి సంవత్సరం దాదాపు 81,700 కొత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తుంది. గతంలో ఊపిరితిత్తుల వ్యాధులు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించేవి, కానీ ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్, COPD, TB వంటి కేసులు యువతలో కూడా వేగంగా కనిపిస్తున్నాయి.
Also Read:
సింహం vs చిరుత.. పిల్లలను కాపాడుకోవడం కోసం చిరుత ఫైటింగ్ చూశారా?
చెప్పులు లేకుండా నడవడం లేదా బూట్లు వేసుకుని నడవడం.. ఏది మంచిది?
For More Latest News