Walking Barefoot Vs Walking with Shoes: చెప్పులు లేకుండా నడవడం లేదా బూట్లు వేసుకుని నడవడం.. ఏది మంచిది?
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:40 AM
చెప్పులు లేకుండా నడవడం మంచిదా లేదా బూట్లతో నడవడం ఆరోగ్యానికి మంచిదా? ఈ విషయంపై కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిరోజూ నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది బరువు తగ్గడానికి, బలం పెంచుకోవడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, చెప్పులు లేకుండా నడవడం మంచిదా లేదా బూట్లు ధరించడం మంచిదా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల కండరాలు బలపడతాయి. సమతుల్యత మెరుగుపడుతుంది. శరీర అవగాహన పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బూట్లతో నడవడం కంటే వృద్ధులు చెప్పులు లేకుండా నడవడం మంచిదని అధ్యయనం సూచిస్తుంది. కానీ, చెప్పులు లేకుండా నడవడం అందరికీ మంచిది కాదు. పదునైన వస్తువులు, మట్టి లేదా కాలుష్యంతో కూడిన ఉపరితలాలపై చెప్పులు లేకుండా నడిస్తే గాయాలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సురక్షితమైన, సహజమైన ఉపరితలాలపై నడవడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా పాదాల వైకల్యాలు, మధుమేహం, న్యూరోపతి (లేదా ఏదైనా తీవ్రమైన గాయం) ఉన్నవారు బయట చెప్పులు లేకుండా నడవడం మంచిది కాదని అధ్యయనం చెబుతోంది. బూట్లు వేసుకుని నడవడం వల్ల పాదాలకు రక్షణ లభిస్తుంది. గాయాలు, ఇన్ఫెక్షన్ల నుంచి సేఫ్‌గా ఉంటారు. మోకాళ్లు, తుంటి, వెన్నెముకపై ఒత్తిడి తగ్గిస్తుంది. అయితే, సరైన వాకింగ్ బూట్లు ఎంచుకోవడం ముఖ్యం. అలాంటి వారు బూట్లు ధరించడం మంచిదని అధ్యయనం సూచిస్తుంది. ఇది బహిరంగ ప్రదేశాల్లో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియాతో ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గిస్తుంది.
Also Read:
ధోనీ నన్ను ఊసరవెల్లిలా మార్చేశాడు.. తన కెరీర్‌పై దినేష్ కార్తీక్ ఏమన్నాడంటే..
నేపాల్ నిరసనల్లో 19 మంది మృతి.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం, నిషేధం ఎత్తివేత
For More Latest News