Leopard vs Lion: సింహం vs చిరుత.. పిల్లలను కాపాడుకోవడం కోసం చిరుత ఫైటింగ్ చూశారా?
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:29 AM
తన పిల్లలకు ప్రమాదం వస్తే సింహంతో పోరాడేందుకైనా తల్లి తెగిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా ఓ చిరుత పులి అలాంటి పనే చేసింది. తన పిల్లలపై దాడి చేసేందుకు వస్తున్న సింహానికి ఎదురునిలిచింది. ఈ క్రమంలో ఈ రెండూ క్రూర మృగాల మధ్య థ్రిల్లింగ్ ఫైట్ జరిగింది.
తన పిల్లలకు ప్రమాదం వస్తే సింహం (Lion)తో పోరాడేందుకైనా తల్లి తెగిస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంటుంది. తాజాగా ఓ చిరుత పులి (Leopard) అలాంటి పనే చేసింది. తన పిల్లలపై దాడి చేసేందుకు వస్తున్న సింహానికి ఎదురునిలిచింది. ఈ క్రమంలో ఈ రెండూ క్రూర మృగాల మధ్య థ్రిల్లింగ్ ఫైట్ జరిగింది. సింహం తన బలంతో ఫైట్ చేస్తే, చిరుత తన తెలివిని ఉపయోగించి ఎదురుదాడి చేసింది. సఫారీ టూరిస్ట్‌లు ఈ వీడియోను చిత్రీకరించారు (Leopard vs Lioness).
its_jungle_ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిరుత పులి తన పిల్లలను ఓ రాయి కింద ఉంచింది. ఆ రాయి పైన కాపాలాగా కూర్చుంది. అక్కడకు ఓ సింహం వచ్చింది. దీంతో రెండింటి మధ్య ఫైటింగ్ మొదలైంది. సింహం తన బలం మొత్తం ఉపయోగించి దాడికి దిగింది. అయితే చిరుత పులి కింద పడిపోయి తన పదునైన గోళ్లతో సింహాన్ని అడ్డుకుంది. సింహం కాస్త వెనక్కి తగ్గగానే అక్కడి నుంచి పారిపోయింది. సింహం కూడా ఆ చిరుతను వెంబడిస్తూ వెళ్లిపోయింది (Wild animal fight).
ఈ థ్రిల్లింగ్ ఫైట్‌ను (Leopard mother fight) సఫారీ టూరిస్ట్‌లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. 7 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజంగా భయంకరమైన యుద్ధం అని ఒకరు కామెంట్ చేశారు. చిరుత ఎప్పుడూ తెలివిని ఉపయోగించి ఫైట్ చేస్తుందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాముల ప్రేమగాథ.. ప్రియుడు చనిపోయాడని ఆ ఆడపాము ఏం చేసిందంటే..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలని మొత్తం పులులను 7 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..