Snake love story: పాముల ప్రేమగాథ.. ప్రియుడు చనిపోయాడని ఆ ఆడపాము ఏం చేసిందంటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:54 AM
ప్రియమైన వారు దూరం కావడం ఎవరికైనా ఎంతో బాధ కలిగించే విషయం. ఎన్నో ఏళ్లుగా కలిసి జీవిస్తున్న వారు హఠాత్తుగా దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ మనుషులకే కాదు.. జంతువులుకు కూడా ఉంటుంది. విష సర్పాలైనా సరే ప్రియమైన వారు దూరమైతే ఎంతో బాధపడతాయి.
ప్రియమైన వారు దూరం కావడం ఎవరికైనా ఎంతో బాధ కలిగించే విషయం. ఎన్నో ఏళ్లుగా కలిసి జీవిస్తున్న వారు హఠాత్తుగా దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ బాధ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. విష సర్పాలైనా సరే ప్రియమైన వారు దూరమైతే ఎంతో బాధపడతాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది హృదయాలు బరువెక్కుతున్నాయి (Female snake mourning).
@DanishgulJunaid అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఛాత్రి గ్రామంలో జేసీబీ కింద పడి ఓ పాము చనిపోయింది. దీంతో ఆ మగపాముతో ఎన్నో ఏళ్లుగా కలిసి నివసిస్తున్న ఆడపాము హృదయం బద్దలైంది. నిర్జీవంగా పడి ఉన్న ఆ మగపాము పక్కనే ఆ ఆడపాము నిశబ్దంగా ఉండిపోయింది. పడగవిప్పి చూస్తూ ఉండిపోయింది. ఆ రెండు పాములు దాదాపు పదిహేడేళ్లుగా కలిసి జీవిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (snake couple 17 years).
ఆ వైరల్ వీడియోను కొన్ని వేల మంది వీక్షించారు (Emotional animal stories). తమ స్పందనలను తెలియజేశారు. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తి మరణించినప్పుడు చాలా బాధగా ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. మనుషుల కంటే జంతువుల మనసులు మరింత సున్నితంగా ఉంటాయని మరొకరు పేర్కొన్నారు. ఇది చూసిన తర్వాత నా హృదయం ముక్కలైందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మీ చూపునకు శక్తి ఉంటే.. ఈ అడవిలో స్పైడర్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
చెప్పింది వినాలి కదా అక్కా.. బైక్ ఎక్కిన ఓ మహిళ పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..