Share News

Girl falls from bike: చెప్పింది వినాలి కదా అక్కా.. బైక్ ఎక్కిన ఓ మహిళ పరిస్థితి ఏమైందో చూడండి..

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:07 AM

ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినపుడు అతిగా ప్రవర్తించకూడదు, పరిణామాలు దారుణంగా ఉంటాయి అని చెబుతుంటారు. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. బైక్ మీద వెళ్తున్న ఒక అబ్బాయి వెనుక కూర్చున్న అమ్మాయి ప్రమాదానికి గురైంది.

Girl falls from bike: చెప్పింది వినాలి కదా అక్కా.. బైక్ ఎక్కిన ఓ మహిళ పరిస్థితి ఏమైందో చూడండి..
saree accident video

ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినపుడు అతిగా ప్రవర్తించకూడదు, పరిణామాలు దారుణంగా ఉంటాయి అని చెబుతుంటారు. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. బైక్ మీద వెళ్తున్న ఒక అబ్బాయి వెనుక కూర్చున్న అమ్మాయి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదానికి సంబంధించి వెనుక వస్తున్న బైకర్ హెచ్చరించినా ఆమె అతి విశ్వాసంతో పట్టించుకోలేదు. దీంతో ఆమె బైక్ మీద నుంచి రోడ్డుపై పడిపోయింది (Saree accident video).


triponthiz అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక అబ్బాయి బైక్ నడుపుతుండగా, అతడి వెనుక ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆ అమ్మాయి చీర ధరించి ఉంది. ఆమె చీరకున్న పైట రోడ్డుపై వేలాడుతూ ఉంది. వెనుక వస్తున్న బైకర్ గమనించి ఆ అమ్మాయిని హెచ్చరించాడు. కానీ, ఆ అమ్మాయి పట్టించుకోకుండా వింత వింత ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చింది. ఇంతలో, అకస్మాత్తుగా చీర బైక్‌లో ఇరుక్కుపోయి ఆ అమ్మాయి కింద పడిపోయింది (Saree pallu stuck).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Bike mishap caught on camera). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. 1.48 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అమ్మాయిలు ప్రమాదం జరిగే వరకు ఏమీ అర్థం చేసుకోరని ఒకరు కామెంట్ చేశారు. ఆమెకు ఇలా జరగాల్సిందేనని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీ చూపునకు శక్తి ఉంటే.. ఈ అడవిలో స్పైడర్‌ను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 10:07 AM