Share News

Husband Assasinated Woman: భర్త ఘాతుకం.. భార్య శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి..

ABN , Publish Date - Sep 04 , 2025 | 10:48 AM

భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాల్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్లిపడేశాడు. కూతురు కనిపించకపోవటంతో సదరు మహిళ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Husband Assasinated Woman: భర్త ఘాతుకం.. భార్య శరీరాన్ని ముక్కలు, ముక్కలుగా కోసి..
Husband Assasinated Woman

కట్టుకున్న భర్త ఓ మహిళ పాలిట కాలయముడు అయ్యాడు. అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. భార్యను చంపి.. ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రం దగ్గర పడేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమ్‌వాడీకి చెందిన 22 ఏళ్ల పర్వీన్ అలియాస్ ముస్కాన్, మహ్మద్ తహ అన్సారీ భార్యా భర్తలు. వీరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. సంవత్సరం క్రితం ఓ బాబు పుట్టాడు. ముస్కాన్ పెళ్లయిన నాటినుంచి భర్త, అత్తింటి వారితో గొడవపడుతూ ఉండేది. గొడవల నేపథ్యంలో భార్యాభర్తలు వేరు కాపురం పెట్టారు. ఈద్గా బే దగ్గర అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, అన్సారీ తన భార్యను దారుణంగా హత్య చేశాడు.


తర్వాత భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. శరీర భాగాల్ని సముద్రం దగ్గరకు తీసుకెళ్లిపడేశాడు. కూతురు కనిపించకపోవటంతో ముస్కాన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం వెతకటం మొదలెట్టారు. ఆగస్టు 30వ తేదీన పోలీసులకు ముస్కాన్ తల దొరికింది. పోలీసులు ఆమె తల్లిని పిలిపించారు. తలను చూపించారు. కూతురి తలను ఆమె గుర్తుపట్టింది. పోలీసులు ముస్కాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.


ఘటనపై భీమ్‌వాడీ డీసీపీ శశికాంత్ బొరాటే మాట్లాడుతూ.. ‘హత్యకు గల సరైన కారణం ఏంటో తెలియరాలేదు. నిందితుడు నిమిషానికో కారణం చెబుతున్నాడు. అతడి మాటలు నమ్మలేకుండా ఉన్నాయి. ఓ సారి ‘నా భార్య పిల్లల్ని కొడుతోంది అందుకే చంపేశాను’ అని అన్నాడు. మరోసారి ‘నా భార్య డ్రగ్స్ తీసుకుంటోంది అందుకే చంపాను’ అన్నాడు. ఇలా మాటలు మారుస్తూనే ఉన్నాడు. దర్యాప్తు జరుగుతోంది. త్వరలో అసలు విషయం తెలుస్తుంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి

యువతికి వింత అనుభవం.. సీటు పక్కన కూర్చున్న వ్యక్తి..

Updated Date - Sep 04 , 2025 | 11:33 AM