Air India Flight Aborts Takeoff: టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి
ABN , Publish Date - Sep 04 , 2025 | 08:52 AM
రన్ వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీ కొట్టింది. పక్షి ఢీకొనటంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు.
గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగుళూరు వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్ వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ఓ పక్షి బలంగా విమానాన్ని ఢీ కొట్టింది. పక్షి ఢీకొనటంతో పైలట్ సడన్ ఎయిర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే విమానాన్ని వెనక్కు తీసుకువచ్చాడు. పార్కింగ్ లాంజ్ ప్రాంతంలోకి విమానాన్ని తీసుకువచ్చి ఆపాడు. ఆ వెంటనే ఎయిర్ ఇండియా టెక్నికల్ టీమ్‌తో పాటు విమానాశ్రయ అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
వృద్ధులకు రాయితీ..
మరోవైపు ఎయిర్ ఇండియా 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్ ధరపై రాయితీ ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్ మూల ధరపై 10 శాతం వరకు, దేశీయ సర్వీసుల్లో 25 శాతం వరకు రాయితీ ఇస్తామని వెల్లడించింది. ఎకనామీ, బిజినెస్ క్లాస్ సహా అన్ని రకాల టికెట్లపై ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రాయితీ పొందాలంటే.. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుకింగ్ సమయంలో ‘కన్‌సెషన్ టైప్’ దగ్గర సీనియర్ సిటిజన్ కోటాను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాయితీతోపాటు సాధారణం కంటే 10 కిలోల వరకు అదనపు లగేజీని సీనియర్ సిటిజన్లు తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఎయిర్ ఇండియా కల్పిస్తోంది.
ఇవి కూడా చదవండి
చెత్త విషయంలో గొడవ.. కర్రలు, ఇటుకలతో దాడి చేసుకున్న జనం..
ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉందా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..