Clash Over Garbage Spill: చెత్త విషయంలో గొడవ.. కర్రలు, ఇటుకలతో దాడి చేసుకున్న జనం..
ABN , Publish Date - Sep 04 , 2025 | 07:53 AM
గొడవలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు గ్రూపుల మధ్య గొడవతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు.
చెత్త విషయంలో చోటుచేసుకున్న గొడవ దారుణానికి తెరతీసింది. రెండు గ్రూపులు కర్రలతో, ఇటుకలతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బాగ్‌పత్‌లోని సూప్ గ్రామంలో కొత్తగా ఓ గుడి నిర్మాణం జరుగుతోంది. గుడి దగ్గర ఓ మహిళ చెత్తపడేయటంతో గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. నిమిషాల్లోనే దాదాపు 50 మంది గొడవలోకి దిగారు.
రెండు గ్రూపులుగా మారి కర్రలు, ఇటుకలతో కొట్టుకోవటం మొదలెట్టారు. గొడవలో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు గ్రూపుల మధ్య గొడవతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరింది. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను ఆపారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గొడవలో పాల్గొన్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై బాగ్‌పట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ‘సెప్టెంబర్ 2వ తేదీన ఈ సంఘటన జరిగింది. చెత్త పడేసే విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఇరు వర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నాము’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
గోమ్టినగర్-మహబూబ్‌నగర్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు
కిమ్‌తో మామూలుగా ఉండదు.. డీఎన్ఏ ఆనవాళ్లు కూడా దొరకకుండా..