Maoists Neutralized In Gadchiroli: భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:49 PM
గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా కూంబింగ్ ఆగలేదు. బుధవారం కూంబింగ్‌లో ఉన్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇవాళ (బుధవారం) జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. గడ్చిరోలి-నారాయణపుర్ సరిహద్దుల్లో గట్టా దళాల్, కంపెనీ నెంబర్ 10తోపాటు మావోయిస్ట్ ఫార్మేషన్స్ ఆఫ్ ది గడ్చిరోలి డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారంతో రెండు రోజుల క్రితం 19సీ 60 కమాండో యూనిట్స్, క్విక్ యాక్షన్ టీమ్స్, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. అక్కడే క్యాంపులు వేసి కూంబింగ్ మొదలెట్టాయి.
గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా కూంబింగ్ ఆగలేదు. బుధవారం కూంబింగ్‌లో ఉన్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయి. గడ్చిరోలి-నారాయణపుర్ సరిహద్దుల వెంబడి భద్రతా దళాలు, మావోలు మధ్య 8 గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా.. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
భద్రతా దళాలు సంఘటనా ప్రదేశం నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం అన్వేషణ మెుదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిపోయి..
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఉంగారానికి ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం..