Taylor Swifts 4 Crore Ring: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఉంగారానికి ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం..
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:00 PM
ఇప్పుడంటే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వజ్రాలు బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. కానీ, ఈ రెండు దేశాల కంటే ముందు ఇండియా వజ్రాలకు పెట్టింది పేరుగా ఉండేది. దాదాపు 2 వేల ఏళ్లుగా కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ప్రపంచ దేశాలకు వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి.
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, ఫుడ్‌బాల్ ప్లేయర్ ట్రావిస్ కెల్సే తమ రిలేషన్‌ను అఫిషియల్ చేసేశారు. తాజాగా, ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టేలర్ స్విఫ్ట్ పెట్టుకున్న ఎంగేజ్‌మెంట్ రింగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఉంగరం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మీడియా కథనాల ప్రకారం.. ఎంగేజ్‌మెంట్ కోసం టేలర్ స్విఫ్ట్ ధరించిన ఆ ఉంగరానికి భారతదేశంతో సంబంధం ఉంది. ఆ ఉంగరంలో పొదగబడిన వజ్రం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో దొరికింది కావడం గమనార్హం.
ఆ వజ్రానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. మన దేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న టైంలో 7 నుంచి 10 క్యారెట్లు ఉండే ఆ వజ్రం దొరికింది. ఇప్పుడంటే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వజ్రాలు బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. కానీ, ఈ రెండు దేశాల కంటే ముందు ఇండియా వజ్రాలకు పెట్టింది పేరుగా ఉండేది. దాదాపు 2 వేల ఏళ్లుగా కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ప్రపంచ దేశాలకు వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి. కొల్లూరు ప్రాంతం వజ్రాల గనిగా ప్రసిద్ధి చెందింది.
అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పరిపాలనలో ఉండేది. ఆ టైంలోనే కోహినూర్, హోప్ వజ్రంతోపాటు టేలర్ స్విఫ్ట్ ఉంగరానికి పొదిగిన వజ్రం కూడా దొరికినట్లు తెలుస్తోంది. అయితే, టేలర్ స్విఫ్ట్ ధరించిన ఈ వజ్రం ధర ఎంతో సరిగ్గా తెలీదు. సుమారు రూ.4.8 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె ధరించిన ఉంగరం గురించి ఇవన్నీ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. అది నిజంగా ఏపీ నుంచి తీసుకెళ్లిన వజ్రమా, కాదా? అన్నదానిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. అది ఓల్డ్ మైన్ డైమండ్ అన్న ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షాపై సీపీఐ నేత రాజా ఫైర్
కలలో వినాయకుడు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?